Friday, April 18, 2025
HomeTrending NewsSudan:సుడాన్‌ అంతర్యుద్ధం...లక్షల మంది వలస బాట

Sudan:సుడాన్‌ అంతర్యుద్ధం…లక్షల మంది వలస బాట

సుడాన్‌ పై పట్టుకోసం సాయుధ బలగాల మధ్య రెండు నెలలుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో అక్కడ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆధిపత్య పోరు కారణంగా లక్షల మంది ప్రజలు వలస బాటపట్టారు. మరోవైపు ఈ యుద్ధం అక్కడి చిన్నారుల పట్ల శాపంగా మారింది. ఆకలికి తాళలేక రాజధాని ఖార్టూమ్‌లోని ఓ అనాథాశ్రమంలో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేస్తోంది.

అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదించిన వివరాల ప్రకారం.. సుడాన్‌పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారామిలిట‌రీ బ‌ల‌గాల‌కు మ‌ధ్య రెండు నెలలుగా ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆధిప‌త్య పోరులో పడి అక్కడి పాలకులు చిన్నారుల సంగతే మర్చిపోయారు. దీంతో పాలు లేక పసి ప్రాణాలకు నీళ్లు పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో తిన‌డానికి తిండిలేక, వైద్యం అందని ప‌రిస్థితుల మ‌ధ్య ఆరు వారాల వ్యవధిలోనే 60 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అందులో రెండు రోజుల వ్యవధిలోనే 26 మంది పసికందులు చనిపోయారు. ఎక్కువ మంది చిన్నారులు ఆహారం అందక, జ్వరంతో ప్రాణాలు కోల్పోయినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ నివేదించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్