Saturday, March 14, 2026
HomeTrending Newsఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్ కు క్లీన్ చీట్

ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్ కు క్లీన్ చీట్

డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణల్లో ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి సన్నా మారిన్ కు క్లీన్ చీట్ వచ్చింది. ఇటీవల ఓ పార్టీలో సన్నా మారిన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. సన్నా మారిన్ డ్రగ్స్ వాడలేదని ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం ప్రకటించింది. స్నేహితులతో సరదాగా గడపడం వాస్తవమేనని, ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్‌ కావడం దురదృష్టకరమని ఆమె అన్నారు. కేవలం ఆల్కహాల్‌ తప్ప ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదని, తన కాలేజీ రోజుల్లో కూడా డ్రగ్స్ వాడలేదని స్పష్టం చేశారు.

ప్రధాని సన్నా మారిన్ ఈ నెల 19వ తేదిన రాజధాని హెల్సింకిలో స్నేహితులతో కలసి ఓ పార్టీలో స్టెప్పులు వేశారు. దానికి సంబంధించిన వీడియో బయటకు రావటంతో రచ్చ రచ్చ అయింది. పార్టీలో ప్రధాని డ్రగ్స్‌ తీసుకున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేశారు. 34 ఏళ్ళ సన్నా మారిన్  స్నేహితులతో ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించి ఉండొచ్చని, ప్రధాని వాటిని తీసుకుని ఉండొచ్చని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సనా మారిన్ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్‌ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. అందరి అనుమానాలను తీర్చడానికే డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నానని ఆమె చెప్పారు.

 

2019లో ఫిన్లాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన 34 ఏళ్ళ సన్నా మారిన్ పై ఆరోపణలు కొత్త కాదు. గతంలో ప్రధానమంత్రి అధికారిక నివాసంలోనే డాన్స్ పార్టీలు స్నేహితులతో చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular