Thursday, March 12, 2026
Homeసినిమాచివరి 20 నిమిషాల కోసం 'ముఖచిత్రం' చూడాల్సిందే: బన్నీవాసు 

చివరి 20 నిమిషాల కోసం ‘ముఖచిత్రం’ చూడాల్సిందే: బన్నీవాసు 

ఈ శుక్రవారం థియేటర్లకి వస్తున్న సినిమాల్లో ‘ముఖచిత్రం‘ కూడా ఉంది. సందీప్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి, గంగాధర్ దర్శకత్వం వహించాడు. వికాస్ వశిష్ఠ .. ప్రియా వడ్లమాని .. చైతన్యరావు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, కాలభైరవ సంగీతాన్ని సమాకూర్చాడు. నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి మారుతి .. బన్నీవాసు ఇద్దరూ కూడా గెస్టులుగా హాజరయ్యారు.

మారుతి మాట్లాడుతూ .. తాను ఈ సినిమా చూశాననీ, ఒక పెద్ద కాన్సెప్టును చిన్న ఆర్టిస్టులతో చేయడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కథకి తగిన ఆర్టిస్టులను డైరెక్టర్ ఎంచుకున్నాడని అనిపించింది. ప్రియా వడ్లమాని నటన గొప్పగా ఉంది .. క్లిష్టతరమైన పాత్రను ఆమె బ్యాలెన్స్ చేయడం బాగుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటారు. చిన్న సినిమాలకు కాలభైరవ తనవంతు సపోర్టును అందిస్తుండటం అభినందనీయం” అన్నారు.

ఇక బన్నీ వాసు మాట్లాడుతూ .. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ అభిరుచి పూర్తిగా మారిపోయిందని అన్నారు.  ఇదివరకూ తారాగణం ఎవరనేది చూసుకుని థియేటర్లకు వచ్చేవారనీ, కానీ ఇప్పుడు కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను తాను  చూశాననీ .. ఆడియన్స్ ఆశించే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈ సినిమాలో ఉందని చెప్పారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు కథను నడిపించిన తీరు, ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుందంటూ  చెప్పుకొచ్చారు.

Also Read : ‘ముఖచిత్రం’ ట్రైలర్ విడుదల 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular