Rohith to Mumbai: మూడో వన్డేకు రోహిత్ దూరం

బంగ్లాదేశ్ తో జరగనున్న మూడో వన్డే మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. నిన్న జరిగిన రెండో వన్డేలో గాయం కారణంగా చివర్లో రోహిత్ బ్యాటింగ్ కు దిగిన సంగతి తెలిసిందే. 28 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లతో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు కూడా తీసుకెళ్ళాడు కానీ ఫలితం దక్కలేదు. కానీ గాయంతో నొప్పి కారణంగా మూడో మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడం లేదని కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించారు. రోహిత్ తో పాటు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ కూడా చివరి వన్డేలో ఆడడం లేదని తెలిపాడు.

రోహిత్ శర్మ ముంబై వెళ్లనున్నాడు, గాయం తీవ్రతపై వైద్యులను సంప్రదించి ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు తిరిగి బంగ్లా వస్తాడా లేదా అనేది తేలనుంది, దీనిపై ఇప్పుడే తాను ఏమీ చెప్పలేనని ద్రావిడ్ పేర్కొన్నాడు.  నిన్నటి మ్యాచ్ లో మూడు ఓవర్లు మాత్రమేబౌల్ చేసిన దీపక్ చాహర్ కూడా గాయంతో మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్ చేరాడు. కుల్దీప్ రెండో మ్యాచ్ కు సైతం దూరమైన సంగతి తెలిసిందే.

తొలి రెండు మ్యాచ్ ల ఫలితాలు ఇండియాకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. ప్రత్యర్థి జట్టును సరిగా అంచనా వేయకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని క్రీడా విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *