Saturday, January 18, 2025
HomeTrending Newsడిసిసిబిలు పటిష్టంగా ఉండాలి : సిఎం జగన్

డిసిసిబిలు పటిష్టంగా ఉండాలి : సిఎం జగన్

Cooperation to Farmers: సహకార బ్యాంకులు మన బ్యాంకులని, వాటిని మనం కాపాడుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  వీటిద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయని, ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.  సహకార బ్యాంకులు ఎంత తక్కువ వడ్డీకి వీలైతే అంత తక్కువకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. సహకార శాఖపై తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.  జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుపై ఆరా తీశారు. సహకార బ్యాంకుల బలోపేతంపై  ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సిఎంకు వివరించారు.  డీసీసీబీలు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది.

ఈ సందర్బంగా సిఎం జగన్ వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి:

⦿ బ్యాకింగ్‌ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలి
⦿ ఈ పోటీని తట్టుకునేందుకు ఆర్షణీయమైన వడ్డీరేట్లతో రుణాలు ఇవ్వండి
⦿ నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధిచెందుతాయి
⦿ మంచి ఎస్‌ఓపీలను పాటించేలా చూడాలి
⦿ డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలి
⦿ డీసీసీబీలు పటిష్టంగా ఉంటే.. రైతులు మేలు పొందుతారు
⦿ బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నాయి
⦿ రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోంది
⦿ ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలి
⦿ వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమవైపుకు తిప్పుకోవచ్చు
⦿ తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుంది
⦿ వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం.
⦿ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకనే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది


⦿ రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదు, రాజకీయాలకు చోటు ఉండకూడదు
⦿ అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలి
⦿ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యం
⦿ పాలనలో సమర్థతతో పాటు, అవినీతి లేకుండా ఉంటేనే, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే… ప్రజలకు నష్టం వాటిల్లుతుంది
⦿ సహకార బ్యాంకుల్లో ఖాతాదారులకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలి
⦿ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్‌)బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగాలి
⦿ ఆ మేరకు పీఏసీఎస్‌లను మ్యాపింగ్‌చేసి… వాటి కింద వచ్చే ఆర్బీకేలను నిర్ణయించాలి
⦿ జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల్లో చక్కటి యాజమాన్య విధానాలను తీసుకురావాలి
⦿ అంతిమంగా ప్రతి ఎకరా సాగుచేస్తున్న ప్రతిరైతుకూ మేలు జరగాలి
⦿ ఈ లక్ష్యం దిశగా సొసైటీలను నడిపించాలి
⦿ ప్రతిపాదనలను మరింత మెరుగ్గా తయారుచేసి తనకు నివేదించాలి
⦿ వ్యవసాయ సలహామండళ్ల సమావేశాల్లో బ్యాకింగ్‌ రంగంపై రైతులనుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి దానిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలి
⦿ ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్‌లను సమర్థవంతంగా వాడుకోవాలి
⦿ బ్యాంకింగ్‌ కార్యకలాపాల్లో కూడా కియోస్క్‌లను సద్వినియోగం చేసుకోవాలి
⦿ రైతులకు సంబంధించి డాక్యుమెంట్లను కియోస్క్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేసే సదుపాయంకూడా ఉండాలి
⦿ ఈ మేరకు కియోస్క్‌ల్లో మార్పులు చేర్పులు చేయాలి

ఈ సమీక్షా సమావేశంలో  వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్‌ ఎం వీ యస్‌ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్