అందాల మెహ్రీన్ కి అవకాశాల కొరత!

wait for Break: తెలుగు తెరకి పరిచయమైన అందాల కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. కథానాయికగా ఆమె తన కెరియర్ ను తెలుగు సినిమాతోనే మొదలుపెట్టింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాలో ఆమెను చూసిన వాళ్లంతా కూడా, ఈ అందానికి అదృష్టం తోడైతే ఆపడం కష్టమే అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమెకి ‘మహానుభావుడు’ సినిమాతో మంచి హిట్ పడింది. ఇక తన జోరు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

కథల ఎంపిక విషయంలో మె జాగ్రత్తగా లేకపోవడం వలన, వరుస పరాజయాలు ఆమె ఖాతాలో పడుతూ వచ్చాయి. ఇక అమ్మడి పనైపోయిందని  అంతా అనుకుంటున్న సమయంలో ‘ఎఫ్ 2’ సక్సెస్ ఆమెకి ఊరటనిచ్చింది. ఆ తరువాత ఆమె తన దూకుడు పెంచడం ఖాయమని చెప్పుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకుండా .. ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేస్తూ వెళ్లింది. అయితే కొన్ని కారణాల వలన ఆమె పెళ్లి విషయంలో తన మనసు మార్చుకుంది. దాంతో చేతిలో సినిమాలు లేకుండా పోయాయి.

ఈ నేపథ్యంలో ‘ఎఫ్ 3‘ సినిమా ఆమెకి ఆశ్రయం ఇచ్చింది. అలాగే మారుతిని రిక్వెస్ట్ చేసి మరీ ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా చేసింది. మరి ఆ తరువాత పరిస్థితి ఏమిటి? అంటే మాత్రం, ఆమె జాబితాలో కొత్త సినిమాలేవీ కనిపించడం లేదు. కొత్త హీరోయిన్లు పొలోమంటూ వస్తున్న సమయంలో మెహ్రీన్ గ్యాప్ తీసుకోవడం ఇప్పుడు ఆమె కెరియర్ పై ఎఫెక్ట్ చూపుతోంది. మెహ్రీన్ త్వరగా తేరుకుని ఈ ఏడాదిలో కొత్త అవకాశాలు దక్కించుకుంటుందేమో .. ఆమె కెరియర్ ఊపందుకుంటుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *