Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Lab Dab:  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌లిసి మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్ – ఫిల్డ్ ఎంటర్టైనర్ `ఎఫ్‌3`…అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ని న‌వ్వుల‌లో ముంచెత్త‌డానికి ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’ ను విడుదల చేశారు. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. ఈ క‌థ డబ్బు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కటి బాణీని సమకూర్చారు. రామ్ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచాయి. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. శ్రోతలను ఈ పాట ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com