Tuesday, June 16, 2026
HomeTrending Newsవిభజన చట్టం హామీలపై చర్చ

విభజన చట్టం హామీలపై చర్చ

హస్తినలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సీఎం కేసీఆర్ ఈ రోజు భేటీ అయ్యారు. అమిత్ షా తో జరిగిన 45 నిముషాల సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాల్ని ప్రస్తావించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, విభజన చట్టం హామీలపై చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంథ్ పెంపుపై నేతల మధ్య చర్చ జరిగింది. మరో 56 సాంక్షన్డ్ పోస్టులు పెంచాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఐపీఎస్ ల సంఖ్య 139 నుంచి 195 కి పెంచాలని అమిత్ షా ను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular