Tuesday, March 19, 2024
HomeTrending NewsBe Alert: తుపానుపై అప్రమత్తంగా ఉండండి: సీఎం

Be Alert: తుపానుపై అప్రమత్తంగా ఉండండి: సీఎం

బంగాళాఖాతంలో తుపాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం సీఎంఓ అధికారుల సమావేశంలో తుపాను పరిస్థితులపై సమీక్షించారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కలిగించాలని, వారికి సహాయకారిగా నిలవాలని సీఎం సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుఫానుగా మారనుంది. ఈ తుఫాను పేరు మాండోస్ అని పెట్టనున్నారు. ఇది నేరుగా చెన్నైకి దగ్గరగా ఆంధ్రా – తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని తాకనుంది. దీని వలన  ఏపీలో మొదట తేలికపాటి  మోస్తరు వర్షాలతో ప్రారంభించి, డిసెంబరు 9 లేదా 10 నుంచి భారీ, అతిభారీ వర్షాలుంటాయి.

తిరుపతి, చిత్తూరు, నెల్లూరు , కడప, అన్నమయ్య, ప్రకాశం, బాపట్ల, కృష్ణా , పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఉండనుంది.

తుఫాను తీరం దగ్గరకి రాగానే వర్షాలు  తీవ్రత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా డిసెంబరు 9 నుంచి 11 మధ్యలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. కూడ నెల్లూరు, ప్రకాశం దక్షిణ భాగాలు, చిత్తురు జిల్లాలోని తూర్పు భాగాలు, తిరుపతి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాల్లో ఎక్కువగా ప్రభావం ఉండనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్