Thursday, March 12, 2026
HomeTrending NewsCM Tour: సిఎం అమలాపురం పర్యటన వాయిదా

CM Tour: సిఎం అమలాపురం పర్యటన వాయిదా

ఎల్లుండి అమలాపురంలో జరగాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. కోనసీమలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిఎం టూర్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సిఎం జగన్ ఎల్లుండి జూన్ 26న డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పర్యటించి మహిళా స్వయం సహాయక సంఘాల కు వడ్డీ లేని రుణాలు అందించే ‘ వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు’ పథకం కింద రుణాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది.

భారీ వర్షాల కారణంగా సిఎం పర్యటన వాయిదా పడిన విషయాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ధ్రువీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular