Sunday, June 14, 2026
Homeసినిమా28న రానున్న ‘ఖుషి’ టైటిల్ సాంగ్ రిలీజ్

28న రానున్న ‘ఖుషి’ టైటిల్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్‌గానే మేకర్లు షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఖుషి చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలు సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటికీ యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రాం రీల్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఖుషి నుంచి మూడో పాట రానుంది. ఖుషి అంటూ సాగే ఈ పాటను జూలై 28న రిలీజ్ చేయతోన్నారు.

ఈ టైటిల్ సాంగ్ అప్ డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో మునిగినట్టు.. అలా గాల్లో తేలిపోతోన్న విజయ్ దేవరకొండ పోస్టర్ ఎంతో కూల్‌గా ఉంది. ఇక ఖుషి టైటిల్ సాంగ్ కోసం శ్రోతలు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. జూలై 28న ఖుషి టైటిల్ సాంగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు. లైగర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఖుషి సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఖుషి ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular