పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేయాలంటూ 19 పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు బట్టారు. ఇది ప్రజాస్వామ్యం స్పూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు.  నూతన భవనాన్ని జాతికి అంకితం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ అభినందనలు తెలియజేశారు. పార్లమెంట్ భవనం ప్రజాస్వామ్యానికి దేవాలయం, ఆత్మ లాంటిదని, దేశ ప్రజల, అన్ని పార్టీల ఆలోచనలకు ప్రతిబింబమని  పేర్కొన్నారు. ఇలాంటి ఓ అపూర్వ వేడుకను బహిష్కరిస్తున్నట్లు చెప్పడం మంచిది కాదన్నారు.

పార్టీలుగా మనకున్న సిద్దాంత వైరుధ్యాలను పక్కన పెట్టి అన్ని పార్టీలు ఈ వేడుకలో పాల్గొనాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం స్పూర్తిని గౌరవిస్తూ తమ పార్టీ ఈ ఘట్టంలో భాగస్వామ్యం అవుతోందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *