Wednesday, June 17, 2026
HomeTrending NewsYS Jagan: నిధులు త్వరగా వచ్చేలా చూడండి: సిఎం జగన్

YS Jagan: నిధులు త్వరగా వచ్చేలా చూడండి: సిఎం జగన్

రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం గత రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు. నేటి ఉదయం ఆర్ధికమంత్రి నిర్మల తో భేటీ అయ్యారు. ఉపాధి హామీ, పెండింగ్ నిధులు, రుణ పరిమితి, తెలంగాణ డిస్కం ల నుంచి రావాల్సిన బకాయిలు… తదితర అంశాలతో కూడిన విజ్ఞాపనను అందించారు.

ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు.

  • ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలి
  • రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా… రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు, నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
  • తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రావాల్సిన బకాయిలు రూ.7,058 కోట్లు వెంటనే ఇప్పించాలి
  • 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి, వాటిని విడుదల చేయించాలి
  • పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలి
  • డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది, ఈ నిధులు విడుదలచేయాలి
  • పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలి
  • పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలి
  • రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది, ప్రత్యేక హోదా మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలి

అంటూ కేంద్రమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో సిఎం విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరి వెళ్లారు.

Also Read : YS Jagan: మహిళా వివక్షపై రాజీలేని పోరాటం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular