Sunday, June 7, 2026
HomeTrending Newsఆవనూనెపై సుంకం తగ్గించండి: సిఎం వినతి

ఆవనూనెపై సుంకం తగ్గించండి: సిఎం వినతి

Consider this: వంటనూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు సిఎం లేఖలు రాశారు. రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై సుంకాన్ని సమీక్షించాలని కోరారు.

2021-22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60శాతం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చిందని లేఖలో సిఎం గుర్తు చేశారు. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు.  ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని, ఈ ప్రభావం వినియోగదారులపై పడిందన్న సిఎం వివరించారు.

రాష్ట్రంలో మూడింట రెండొంతులమంది సన్‌ఫ్లవర్‌నే వాడుతారని, దీని తర్వాత పామాయిల్‌ను 28శాతం మంది, వేరుశెనగనూనెను 4.3 శాతం మంది వాడుతారని, మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఎలాంటి ఇబ్బందిలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని సీఎం వెల్లడించారు. విజిలెన్స్, పౌర సరఫరాలు, తూనికలు కొలతల శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుకూడా తీసుకున్నాయని  సిఎం లేఖలో తెలిపారు. కొరతలేకుండా వంటనూనెలు సరఫరా చేయడానికి, రోజువారీగా ధరలు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌కూడా ఏర్పాటు చేశామని తెలిపిన సీఎం.

వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాదికాలంపాటు ఆవనూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలనిమ తద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుగలుగుతామని సిఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Also Read : ఆయిల్ ఫామ్ ధరలపై త్వరలో నిర్ణయం: కాకాణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular