Saturday, June 13, 2026
HomeTrending Newsవ్యవసాయ శాఖకు అవార్డులు: సిఎం కితాబు

వ్యవసాయ శాఖకు అవార్డులు: సిఎం కితాబు

ప్రఖ్యాత అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఢిల్లీలో నిర్వహించిన 13 వ అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌ 2022లో పాలసీ లీడర్‌షిప్‌ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయ శాఖ అవార్డు అవార్డులు గెల్చుకుంది.  నేడు సిఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని రాష్ట్రానికి వచ్చిన అవార్డును  అధికారులు చూపించారు.  ఈ సందర్భంగా సిఎం వ్యవసాయ శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌. శేఖర్‌ బాబు గెడ్డం సిఎంను కలిసినవారిలో ఉన్నారు.   జగన్‌ నేతృత్వంలో గడిచిన మూడున్నరేళ్ళుగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో అత్యుత్తమ పాలసీ విధానాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఏపీ ప్రభుత్వం కైవసం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular