Saturday, June 13, 2026
HomeTrending Newsఆరోగ్య శాఖకు సిఎం అభినందన

ఆరోగ్య శాఖకు సిఎం అభినందన

డిజిటల్‌ హెల్త్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రెండు గ్లోబల్‌ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ సమ్మిట్‌ 2022లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఈ అవార్డులు అందుకున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డిని కలిసి అవార్డు వివరాలను మంత్రి రజిని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబులు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు.

రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్దికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి దక్కిన రెండు గ్లోబల్‌ డిజిటల్‌ హెల్త్‌ అవార్డులు దక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular