Saturday, November 23, 2024
HomeTrending Newsఉర్దూ వర్సిటీ పనులకు ప్రాధాన్యం: సిఎం

ఉర్దూ వర్సిటీ పనులకు ప్రాధాన్యం: సిఎం

మైనార్టీ విద్యార్ధుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాధాన్యతా అంశంగా తీసుకుని, నాడు–నేడు తరహాలో యూనివర్సీటీ పనులు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

క్యాంప్‌ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం చేసిన పలు సూచనలు:

  • వక్ఫ్‌ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి, దీనిపై పూర్తి స్ధాయిలో అధ్యయనం చేయాలి
  • వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఆ భూముల చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలి
  • ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలి
  • నిర్మాణం చేపట్టిన తర్వాత ఆయా చోట్ల హోంగార్డులను రక్షణ కోసం నియమించేలా చూడాలి
  • ఆ భూములను ఏ మేరకు వాడుకోగలమో నిపుణలు సలహా తీసుకోవాలి
  • వైయస్సార్‌ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్‌ ఆస్తులు కూడా సర్వే చేయాలి
  • తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్రమణలో ఉన్న సుమారు 500 ఎకరాల వక్ఫ్‌ బోర్డు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నాం
  • కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌  ఏర్పాటు దిశగా చర్యలు
  • మైనార్టీలకు కొత్త శ్మశాన వాటికలు ఈ యేడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని నిర్మాణం చేపట్టాలి,  అవసరాలకు తగినట్టుగా కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాలి
  • ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లింపులు జరగాలి
  • మైనార్టీలకూ సబ్‌ప్లాన్‌  అమలుకు చర్యలు చేపట్టాలి
  • మైనార్టీ శాఖలో పెండింగ్‌ సమస్యల పై పూర్తి స్ధాయి నివేదిక ఇవ్వాలి
  • ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి
  • షాదీఖానాలు నిర్వహణను కూడా మైనారిటీశాఖకు బదిలీ చేయాలి
  • విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్‌ నిర్మాణానికి సీఎం అంగీకారం
  • గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, అర్ధాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజద్‌ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ కె శారదా దేవి, ఏపీ సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సీఈఓ పి రవి సుభాష్, ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ అలీం బాషా, ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్