Thursday, April 25, 2024
Homeస్పోర్ట్స్ఒలింపిక్స్ విజేతలకు సత్కారం

ఒలింపిక్స్ విజేతలకు సత్కారం

టోక్యో ఒలింపిక్స్ విజేతలకు కేంద్ర క్రీడా శాఖా ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి నితీష్ ప్రామానిక్ తదితరులు పాల్గొన్నారు.

మీరాబాయి చాను, పి.వి. సింధు మినహా మిగిలిన ఒలింపిక్స్ విజేతలు అందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.  జావెలిన్ త్రో  విభాగంలో స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రా, రెజ్లర్లు రవికుమార్ దహియా, బజరంగ్ పునియా, బాక్సర్ లవ్లీనా, భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు పాల్గొన్నారు.

అంతకుముందు న్యూ ఢిల్లీ విమానాశ్రయంలో క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) అధికారులు ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. పలువురు క్రీడాభిమానులు, ఎయిర్ పోర్ట్ సిబ్బంది విజేతలతో ఫోటో దిగడానికి ఉత్సాహం చూపారు.

మీరాబాయి చాను, సింధులకు క్రీడా మంత్రిత్వ శాఖ తరఫున ఇప్పటికే సత్కారం జరిగినందున వారు హాజరు కాలేదని తెలుస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒలింపిక్స్ విజేతలందరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటించ నున్నారు. వారికి తన నివాసంలో విందు కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్