Sunday, October 1, 2023
HomeTrending Newsరైతులకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా పథకం: సిఎం

రైతులకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా పథకం: సిఎం

వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తరహాలో రైతులకూ ఓ కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు సలహాలు సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  వ్యవసాయం, ఫిషరీస్, రెవిన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌   శాఖల మధ్య పటిష్టమైన సమన్వయం ఉండాలని, దీనికోసం సమర్థవంతమైన మార్గదర్శక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమన్వయం కోసం ఓ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో  వ్యవసాయ శాఖ, పౌరసరఫరాలశాఖలపై  సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ చేసిన సూచనలు:

  • రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి
  • విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా, పిషరీస్, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్‌జీల నిర్వహణ తదితర కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాయి
  • ఇవి సమర్థవంతంగా ముందుకు సాగాలంటే.. సంబంధిత శాఖలతో (లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌) చక్కటి సమన్వయం అవసరం
  •  నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించి వివిధ శాఖలతో కలిసి అనుసంధానమై ముందుకు సాగాల్సిన అవసరం ఉంది
  • అవసరం లేకపోయినా, విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి, దీనిపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది:
  • ప్రతిరైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలి

  • రైతు సాగుచేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి? ఎలాంటి పంటలకు అనుకూలం? ఎలాంటి రకాలు వేయాలి? ఎంతమోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించాలి
  • దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గుతుంది
  • ఒక మనిషికి డాక్టర్‌ ఎలా ఉపయోగపడతాడో, పంటలసాగులో రైతులకు ఆర్బీకేలు అదే విధంగా ఉపయోగపడాలి
  •  ప్రతి ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత సాయిల్‌టెస్టులు చేసేవిధంగా ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలి
  • ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి
  • కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదు, రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందే:
  •  ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు, ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ టెస్టింగ్, క్వాంటిటీ టెస్టింగ్‌ జరగాలి
  • ధాన్యం కొనుగోలు ప్రక్రియమీద, ఎంఎస్‌పీ మీద,  అనుసరించాల్సిన నియమాలమీద రైతుల్లో అవగాహన కల్పించాలి
  • ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలి
  • ఆర్బీకేల స్థాయిలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకోవాలి
  • ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామసచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలి, వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ సి. హరికిరణ్, మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ వీసీ అండ్‌ ఎండీ వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Also Read తోటల పెంపకంపై రైతులకు శిక్షణ

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న