పోలవరం ముంపు బాధితులకు పరిహారం మొత్తం ఇచ్చిన తరువాతే  ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు పూర్తిగా  పరిహారం ఇవ్వాలంటే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు అవసరమని, వీటికోసం కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పడుతున్నామని వ్యాఖ్యానించారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా కోయుగులో వరద ముంపు బాధితులను పరామర్శించారు. తమ ప్రభుత్వం బాధితులకు ఎలా పరిహారం ఇవాలో ఆలోచిస్తుంది తప్ప ఎవరికీ ఎగ్గొట్టాలని అలోచించబోదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరక్కుండా చూస్తామన్నారు. నాలుగు  ముంపు మండలాలకు కలిపి ఓ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు.

ఈసారి ఢిల్లీ పర్యటనలో ఇక్కడి ప్రజల బాధలను కేంద్రానికి చెప్పి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వాసితులకు అన్యాయం జరగబోనీయనన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం  జరుగుతోందని, నోటిఫికేషన్ ఇచ్చిన మూడేళ్ళలో పరిహారం ఇవ్వాలని, లేకపోతే మళ్ళీ రీ సర్వే ఇవ్వాల్సి ఉంటుందని, డబ్బులు ముంద్రించేది వాళ్ళే కదా, వాళ్ళ చేతుల్లో డబ్బులు లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటాయని అన్నారు.

నిర్వాసితులకు ఇళ్లు వీలైనంత త్వరగా నిర్మించి ఇస్తామన్నారు. సెప్టెంబర్ లోపు 41.15 అడుగులు మాత్రమే నీరు నింపుతామని, పరిహారం ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతానికి వారిని తరలిస్తామని చెప్పారు. సెప్టెంబర్ లోగా కేంద్రంనుంచి ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోతే రాష్ట్రం నుంచిఅయినా ఇస్తామని చెప్పారు. మీరు చేసిన త్యగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్పూర్తిగా నమ్ముతున్న వ్యక్తినని చెప్పారు. నిర్వాసితులందరికీ పరిహారం సంపూర్ణంగా అందించిన తరువాతే పూర్తి నీటి నీటి మట్టం 45.72 అడుగులు నింపుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *