రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించి చినముషివాడలో శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్న అనంతరం అమ్మవారి దీక్షా పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, ఉత్తరాదికారి స్వాత్మానంద్రేంద్ర స్వామి సిఎం జగన్ కు ఆశీస్సులు అందించారు.





ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.