ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్ధలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలని నిర్దేశించారు. హార్టికల్చర్, సెరికల్చర్, వ్యవసాయ అనుబంధశాఖలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సెరికల్చర్ ఉత్పత్తులను సీఎం పరిశీలించారు.
ఈ సందర్భంగా అయన చేసిన సూచనలు:
- నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలి
- ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ప్రాససింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాససింగ్‌కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలి
- కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి
- నాణ్యమైన మంచి రకం ఉల్లి సాగయ్యేలా చూడండి
- ఫుడ్ ప్రాససింగ్‌కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి
- టమోటను రోడ్డుమీద వేయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదు, దీనికోసం సరైన పరిష్కారాలను చూపాలి
- కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలి
- మిరపసాగు విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాససింగ్‌పైనా మరింత ధ్యాసపెట్టాలి
- కొబ్బరికి కూడా మంచి ధర వచ్చేలా చూడాలని సీఎం ఆదేశం
- కొబ్బరిమీద నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీకి సీఎం ఆదేశం
- కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యలమీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలి
- అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశం
- అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలి
- దీనివల్ల వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం వస్తాయి
- అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలి
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాససింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ, సహాకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రామభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్చికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.