Sunday, May 19, 2024
HomeTrending Newsదళితబంధుపై కుట్రలు  

దళితబంధుపై కుట్రలు  

దళితబంధు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దళిత బంధు అమలు అయితే పుట్ట గతులు ఉండవనే భావనతో  కొందరు కుయుక్తులు పన్నుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దళితబంధుపై ఎలాంటి ఆపోహలు, అనుమానాలు వద్దన్నారు. దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవరో అడిగితే ఇచ్చింది కాదు, ఎన్నికల వాగ్దానం అసలే కాదని మంత్రి స్పష్టం చేశారు.

సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడ్డ ఒక వర్గాన్ని బాగు చేయడానికీ రూపొందించిన పథకం రైతుబందు అని మంత్రి వివరించారు. దళిత జాతి బాగుండాలని ఈ పథకాన్ని రూపొందిస్తే, ఎందుకు అడ్డుకుంటున్నరో యావత్తు దళిత జాతి బిజెపి నాయకుల్ని ప్రశ్నించాలని మంత్రి కొప్పుల పిలుపు ఇచ్చారు. అధికారుల బృందం సర్వే చేస్తోందని, ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకురుతున్దన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన రోజు లాంఛనంగా కొంత మందికి ఇస్తారన్న మంత్రి పథకం ప్రారంభం అయిన మరుసటి రోజు నుండి అకౌంట్లో డబ్బులు పడుతాయన్నారు. సర్వే పూర్తి అయిన తర్వాత ఒకే సారి అందరికి ఇస్తామని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్