CM Jagan Confirmed The Candidates For Mlcs :
ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నిక జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నేత, మాజీ డిసిసిబి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ ఇషాక్ భాషా, కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్లను సిఎం జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
ఎనిమిది జిల్లాల నుంచి స్థానిక సంస్థల కోటాలో మరో 11 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదలైందని, సామాజిక న్యాయం, సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్థానాలకు కూడా అభ్యర్ధులను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని సజ్జల చెప్పారు. మొత్తం 14 సీట్లలో తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు కేటాయించేలా సిఎం జగన్ పేర్లు ఖరారు చేస్తారని వివరించారు.
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేయవలసిన అవసరం లేదని, ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశలో ప్రయత్నం మొదలు పెట్టిందని, ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సిఎంతో సమావేశమయ్యారని సజ్జల చెప్పారు.
Also Read :