Sunday, June 14, 2026
HomeTrending Newsమల్లాది విష్ణుకు సిఎం పరామర్శ

మల్లాది విష్ణుకు సిఎం పరామర్శ

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ ఉదయం విష్ణు మాతృమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సిఎం జగన్ కాసేపటి క్రితం విజయవాడలోని ఎంజి రోడ్ లో ఉన్న విష్ణు నివాసానికి చేరుకొని  శ్రీమతి బాలా త్రిపుర సుందరి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విష్ణు కుటుంబ సభ్యులను సిఎం ఓదార్చారు. అనారోగ్యం, చికిత్స వివరాలు అడిగి తెలుసుకునారు.

సిఎం వెంట మంత్రి జోగి రమేష్, విజయవాడ ఈస్ట్ వైఎస్సర్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ , ఇతర నేతలు, అధికారులు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular