పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా ఉన్నప్పుడు, ఉన్నత విద్య అందరికీ అందుబాటులో వచ్చినప్పుడే విద్యార్ధుల తలరాతలు, తద్వారా వారి జీవితాలు మారతాయని వివరించారు. దీని కోసమే జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు.
ఈ పధకం ద్వారా ఫీజు రీఇంబర్స్ మెంట్ సొమ్మును నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకే ఏటా నాలుగు వాయిదాలలో జమ చేస్తారు. ఈ ఏడు రెండో విడత సాయాన్ని సిఎం జగన్ నేడు కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను అందించారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ…
- 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం 33 శాతం ఉంది, దేశం సగటు నిరక్షరాస్యత 27 శాతంగా ఉంది
- దేశంలో 73 శాతం విద్యార్ధులు ఇంటర్ తరువాత ఉన్నత విద్య అభ్యసించడం లేదు
- మన రాష్రంలో టెన్త్ తరువాత డ్రాప్ ఔట్స్ పెరగడం ఆందోళనకరం
- రాష్ట్రంలో విద్యార్ధులకు పూర్తిగా ఫీజు రీఇంబర్స్ మెంట్ ఇస్తున్నాం
- దేశంలో పూర్తి ఫీజు రీఇంబర్స్ మెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
- తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన కూడా అందిస్తున్నాం
- మేం నిరంతరం విద్యార్ధుల భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నాం
- ప్రతి ఒక్కరూ బాగా చాడువుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం