Friday, September 20, 2024
HomeTrending Newsవిద్యార్ధుల్లో స్పూర్తి కలిగిస్తున్నాం: సిఎం జగన్

విద్యార్ధుల్లో స్పూర్తి కలిగిస్తున్నాం: సిఎం జగన్

ఎవరైనా కష్టపడి చదవితే, మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే.. ఫీజులు ఎంతైనా ఇబ్బంది పడాల్సిన పనిలేదని, ప్రభుత్వం వారిని చదివించే బాధ్యత తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. తద్వారా విద్యార్దులో ఉన్నత విద్య అభ్యసించాలన్న ఆకాంక్షను కలిగిస్తున్నామని వెల్లడించారు.  జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక పథకాల ద్వారా… విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్ధులకు రూ.41.60 కోట్లను… సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్ధులకు ప్రోత్సాహకంగా రూ.100.50 లక్షలను మొత్తం రూ.42.60 కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

“సాచ్యురేషన్‌ విధానంలో, పారదర్శకంగా ఎవరికైనా టైమ్స్‌ రేటింగ్స్‌లో కానీ, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో కానీ, క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో కానీ టాప్‌–50 కాలేజీలకు సంబంధించి 21 ఫ్యాకల్టీలలో ఉన్న దాదాపు 350 కాలేజీలలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎవరికి సీటు వచ్చినా మొత్తం ఫీజు… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల పిల్లలకు రూ.1.25 కోట్లు వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, మిగిలినవారికి రూ.1కోటి వరకు.. దాదాపు మొత్తం ఫీజు అందించే కార్యక్రమం జరుగుతోంది. ఈ సంవత్సరం దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి.ఈ కార్యక్రమంలో వారికి ఫీజులు కోసం రూ.9.50 కోట్లు ఇవ్వడం జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటివరకు చదువుతున్న 408 మందిలో ఈ సీజన్‌లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందిని కలుపుకుంటే…వారికి కూడా రూ.41.60 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొత్తం ఈ 408 మంది పిల్లల కోసం రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నాం” అంటూ వివరించారు.

సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక పథకంపై మాట్లాడుతూ… “మన రాష్ట్రంలో యువత ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్‌ కావాలని కలగంటారు. ఇక్కడ నుంచి కూడా స్ఫూర్తి నిచ్చే వ్యక్తులు, వారి విజయాల కథలు రావాలన్న తపన, తాపత్రయంతో దీనికి సంబంధించి మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.ఎవరైనా ప్రిలిమ్స్‌ పాసైనవారికి రూ.1 లక్ష ఇచ్చేట్టుగా, ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు వెళితే మరో రూ.50 మొత్తంగా రూ.1.50 లక్షలు వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం. ఎన్నిసార్లు వాళ్లు రాసినా ఈ సపోర్టు వారికి కంటిన్యూ అవుతుంది. ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది స్ఫూర్తి పొందుతారు. ఇంకా ఎక్కువ మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మన రాష్ట్రం నుంచి అవుతారన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.

ఈకార్యక్రమం ద్వారా 95 మంది తమ్ముళ్లు ప్రిలిమ్స్‌ క్లియర్‌ చేసారు వాళ్లకు రూ.1లక్ష ఇస్తున్నాం. 11 మంది ప్రిలిమ్స్‌ స్టేజ్‌ నుంచి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. వారికి మరో రూ.50 వేలు కూడా ఇస్తూ ఈ రోజు ప్రారంభిస్తున్నాను” అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

సాంఘిక సంక్షేమశాఖమంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్‌, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్ట్ విజయకృష్ణన్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతవిద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్