Friday, November 22, 2024
HomeTrending News8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం : సిఎం జగన్

8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం : సిఎం జగన్

ప్రతి నియోజకవర్గానికి ఒక ఆక్వా ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.2,775 కోట్లతో 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 4 ఫిషింగ్‌ హార్బర్లకు టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 100కు పైగా ఆక్వా హబ్‌లను నిర్మించేందుకు కార్యాచరణ చేపట్టామని వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేసింది.  ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు.

వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా ఉండేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి వివరించారు. 1,19,875 కుటుంబాలకు రూ.10వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోందని ముఖ్యమంత్రి వివరించారు.

గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారులను ఆదుకున్నవారే లేరన్నారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్