Saturday, April 20, 2024
Homeతెలంగాణదమ్ముంటే రాజీనామా చెయ్: గంగుల

దమ్ముంటే రాజీనామా చెయ్: గంగుల

ఈటెల రాజేందర్ కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ చేశారు. ఈటెల సగం బిసి అని, కానీ తాను పూర్తి బిసినని వ్యాఖ్యానించారు. బిడ్డా అంటూ ఈటెల మాట్లాడుతున్నారని. బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. అసైన్డ్ భూములు కొన్నట్లు ఈటెల స్వయంగా ఒప్పుకున్నారని, అన్నీ పరిశీలించిన తరువాతే సిఎం కెసిఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారని గంగుల వివరించారు.

మొదటిసారి హుజురాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్లి అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని, కానీ హైదరాబాద్ లో ఒక్క బిసి నాయకుడిని కూడా ఈటెల కలవలేదని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి నేతల ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

కరీంనగర్ జిల్లాను బొందల గడ్డను చేశానని ఈటెల అన్నారని, అయన మ్మెల్యే కాక ముందే హుజురాబాద్ నియోజకవర్గంలో 30 గ్రానైట్ క్వారీలు నడిచాయని, వారి దగ్గర ఎంత తీసుకున్నారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు.

తానూ ట్యాక్స్ లు ఎగ్గోడుతున్నట్లు ఈటెల మాట్లాడారని, 2008 ట్యాక్స్ లు కట్టకపోతే ప్రభుత్వం చూస్తూ వూరుకుంటుందా అని గంగుల నిలదీశారు. ఈటెలకు దమ్ముంటే విచారణ చేయించాలని తానూ టాక్స్ లు కట్టలేదని నిరూపిస్తే ఐదు రెట్లు ఎక్కువగా కట్టేందుకు సిద్ధంగా వున్నానని గంగుల ప్రకటించారు. తన అధీనంలో వున్న భూములను ఈటెల ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్