Wednesday, June 17, 2026
HomeTrending NewsYS Jagan: పేదల పట్ల మమకారం చూపండి: జగన్ విజ్ఞప్తి

YS Jagan: పేదల పట్ల మమకారం చూపండి: జగన్ విజ్ఞప్తి

వైఎస్సార్ లా నేస్తం ద్వారా లబ్ధి పొందుతోన్న జూనియర్ న్యాయవాదులు భవిష్యత్తులో స్థిరపడ్డాక ఇదే మమకారం పేదల పట్ల చూపిస్తారన్నది తన విశ్వాసమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. “ప్రభుత్వం తరపు నుంచి ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతుంది. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు… ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేటట్టుగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని సిఎం అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5000 స్టైఫండ్‌ చొప్పున ఫిబ్రవరి 2023 – జూన్‌ 2023 (5నెలలు)కు ఒక్కొక్కరికి రూ.25,000 ఇస్తూ మొత్తం రూ. 6,12,65,000ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి సిఎం జగన్ జమ చేశారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ

  • న్యాయవాదులు లా కోర్సు పూర్తిచేసినా  మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది.
  • అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగుపెడుతున్న  పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నాం.
  • మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇస్తున్నాం. దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు.
  • ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారు అన్న మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించాం.
  • 4 ఏళ్లలో 5,781 మందికి రూ.41.52 కోట్లు..  ఇప్పటివరకూ 5,781 మంది జూనియర్‌ న్యాయవాదులకి మేలు చేశాం.
  • ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది.
  • ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేశాం.
  • మెడిక్లెయిం కాని, న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటివాటికి, ఈ ఫండ్‌ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగింది.
  • ఈ రెండు కార్యక్రమాల ద్వారా నాలుగేళ్ల కాలంలో అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది.

అంటూ సిఎం జగన్ వివరించారు.  సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, ఇతర అధికారులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: YSRCP: ఇంటింటికీ వెళ్ళాల్సిందే : సిఎం జగన్ ఆదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular