Saturday, January 18, 2025
HomeTrending NewsYSR Raithu Bharosa: కౌలు రైతులను ఆదుకుంటున్నాం: జగన్

YSR Raithu Bharosa: కౌలు రైతులను ఆదుకుంటున్నాం: జగన్

దేశంలో ఎక్కడా జరగని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు,  ఆర్వోఎఫ్‌ఆర్‌ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా  సాయం అందిస్తోన్న ఘనత తమకే దక్కుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా లేదన్నారు.  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేశారు.

ఈ సందర్భంగా సిఎం జగన్‌ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు

⦿ వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2023–24కు సంబంధించిన తొలివిడత పెట్టుబడి సాయం ఈరోజు అందించడం జరుగుతోంది
⦿ ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం
⦿ 2023–24 సీజన్‌కు సంబంధించి కౌలు రైతుల కోసం చట్టాన్ని తీసుకొచ్చాం.
⦿ 11 నెలలపాటు సీసీఆర్‌సీ కార్డులు, కౌలు రైతులకు సంబంధించి నష్టం జరగకుండా లీజు డాక్యుమెంట్లను గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాం.
⦿ సీసీఆర్‌సీ కార్డులు కౌలు రైతులకు ఇస్తే రావాల్సినవి రాకుండా పోయే పరిస్థితి ఉండదు. రైతు భరోసాతోపాటు అన్నీ వస్తాయి. తద్వారా కౌలు రైతులకు, రైతులకు మధ్య అవగాహన తీసుకొచ్చాం.
⦿ కౌలు చేసుకుంటున్న వీరికి ఈరోజు తొలి విడత రైతు భరోసా సొమ్ము రూ.7500 చొప్పున అందిస్తున్నాం.
⦿ 1,46,324 మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చి, ఆయా గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేల పరిధిలో రైతులందరికీ తోడుగా, అండగా నిలబడుతున్నాం.
⦿ మొదటి విడత కింద రూ.109 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.
⦿ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది.


⦿ 50 నెలల్లోనే 5,28,000 మంది కౌలు రైతులకు సాయం అందించాం.
⦿ 3.99 లక్షల మందికి ఆర్వోఎఫ్‌ఆర్,‌ 9.22 లక్షల మందికి మంచి జరిగిస్తూ రూ.1,122 కోట్లు నేరుగా ఇచ్చాం.
⦿ పంట వేసుకొనే దానికి ఉపయోగపడేలా పెట్టుబడి సాయంగా అందిస్తూ మంచి చేస్తున్నాం.
⦿ 2019 మనందరి ప్రభుత్వం వచ్చిననాటి నుంచి 50 నెలల కాలంలోనే వైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ అనే ఒక్క కార్యక్రమం ద్వారా మాత్రమే 52.50 లక్షల మంది రైతులకు మంచి జరిగిస్తూ రూ.31 వేల కోట్లను నేరుగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేయగలిగాం.
⦿ రాష్ట్రంలో అర హెక్టారులోపు ఉన్న రైతులు దాదాపు 60 శాతం ఉన్నారు.
⦿ ఒక హెక్టారు దాకా దీన్ని తీసుకుపోతే 60 శాతా కాస్తా 70 శాతం పైచిలుకు దాకా పోతోంది.
⦿ రూ.13,500 పెట్టుబడి సాయంగా ఇస్తున్నాం. ఈ సొమ్ము 60 శాతం మంది రైతులు అందరికీ 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సాయంగా అందుతోంది.
⦿ దీని వల్ల వాళ్లు బయట అప్పులు చేసుకోవాల్సిన అవసరం రాదు. కరెక్టుగా మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, సంక్రాంతికి రూ.2 వేలు ఇస్తున్నాం.
⦿ పంట వేసే టయానికి, కోసేటప్పుడు వాళ్ల చేతిలో డబ్బులు పడే సరికి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి నష్టపోకుండా వ్యవసాయం చేయగలిగే పరిస్థితి వచ్చింది.
⦿ ఈవైఎస్సార్‌ రైతు భరోసా పీఎం కిసాన్‌ అనే ఒక్క కార్యక్రమం ద్వారా రూ.13,500 అన్నది హెక్టారులోపు ఉన్న 70 శాతం మంది రైతులకు ఎంతో మేలు చేస్తోంది.
⦿ ఇన్‌పుట్‌సబ్సిడీకి సంబంధించి మొన్న వర్షాల వల్ల గోదావరి, భారీ వరదలు వచ్చాయి.
⦿ ఈ సీజన్‌ ముగిసేలోగానే 4,879 హెక్టార్లలో రకరకాల పంటలు ఆగస్టులోపు నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీగా రోజు రూ.11 కోట్లు వాళ్ల చేతిలో కరెక్టుగా సమయానికి పెట్టడం జరుగుతోంది.
⦿ ఈ గొప్ప కార్యక్రమం ద్వారా రూ.1,977 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇస్తూ రైతు నష్టపోకుండా చేయి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం.
⦿ దాంతోపాటు ఇప్పటికే 38 కోట్లు ఫ్లడ్‌ రిలీఫ్‌లో భాగంగా వాళ్లందరికీ సాయం చేశాం.
⦿ వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే వారిని ఆదుకుంటున్నాం.
⦿ పంటలు వేసుకొనేందకు 80 శాతం రాయితీతో వరి విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇప్పటికే సరఫరా చేసి తోడుగా నిలబడగలిగాం.


⦿ రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే ఎలాంటి విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగాం అని గమనిస్తే..
⦿ కళ్ల ఎదుటనే కనిపించే కొన్ని విషయాలు మీ అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్పదలచుకున్నా.
⦿ ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ మన కళ్లెదుటే కనిపిస్తోంది.
⦿ రైతులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ బటన్‌ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్