21.3 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeసినిమాEk Dum Ek Dum: రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ సింగిల్ 'ఏక్ దమ్' సెప్టెంబర్...

Ek Dum Ek Dum: రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ సింగిల్ ‘ఏక్ దమ్’ సెప్టెంబర్ 5న విడుదల

రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. 1970ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు సూపర్ ఎంటర్‌టైనింగ్, ఎనర్జిటిక్ అవతార్‌ ని పెప్పీ నంబర్ లో చూడటానికి సిద్ధంగా ఉండండి. రవితేజ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్‌లు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘ఏక్ దమ్ ఏక్ దమ్’ సెప్టెంబర్ 5న విడుదల కానుంది.అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ, నూపూర్ సనన్ రెట్రో అవతార్‌లలో కనిపించడం ఆకట్టుకుంది.  నుపుర్ తన చేతుల్లో పుస్తకాలు పట్టుకుని కాలేజీ విద్యార్థినిగా కనిపిస్తుంది. రవితేజ ఆమెను  ఆటపట్టించడం, బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్సర్‌లను కూడా గమనించవచ్చు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్