Sunday, September 22, 2024
HomeTrending Newsవైద్య ఆరోగ్య శాఖలో భారీ నియామకాలు: సిఎం

వైద్య ఆరోగ్య శాఖలో భారీ నియామకాలు: సిఎం

వైద్య ఆరోగ్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి నియామక ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని  క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై సిఎం జగన్‌సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిఎం వైఎస్‌.జగన్‌ చేసిన సూచనలు:

➽ కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం
➽ తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి
➽ సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం
➽ ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది


➽ వైద్యంకోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి
➽ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి
➽ ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి
➽ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టులతో పాటు అన్ని ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి
➽ ఒక డాక్టరు సెలవులో వెళ్తే, మరో డాక్టరు విధులు నిర్వహించేలా తగిన సంఖ్యలో వైద్యులను నియమించండి
➽ కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారు గోవిందహరి,  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్