Friday, April 19, 2024
Homeసినిమాప్రేక్షకులకు బాగా ఎక్కుతున్న ‘ఎక్కేసిందే’ సాంగ్

ప్రేక్షకులకు బాగా ఎక్కుతున్న ‘ఎక్కేసిందే’ సాంగ్

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎక్కేసిందే’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫాస్ట్ పెప్పిగా ఉన్న ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రామ్ మిరియాల ఈ పాట పాడారు. అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్ సూపర్ హిట్ అయింది.

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. ‘మహానుభావుడు’ లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. ‘టాక్సీవాలా’ తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు

‘మంచి రోజులు వచ్చాయి’ వస్తుంది. ‘ఏక్ మినీ కథ’ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. ‘ఎక్కేసిందే’ పాటలో సంతోష్ శోభన్, మెహిరీన్ కెమిస్ట్రీ బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్