Sunday, June 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం

నలుగురు కానిస్టేబుళ్ల దుర్మరణం

శ్రీకాకుళం జిలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు దుర్మరణం పాలయ్యారు.  పలాస మండలం సుమ్మాదేవి వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం సమీపంలోని భైరి సింగుపురానికి చెందిన ఆర్మీ జవాను ఇటీవల మరణించారు. అయన మృత దేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా ఏఆర్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం రైల్వే గేటు సమీపానికి రాగానే టైరు పేలి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.

జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృత దేహాలకు పలాస ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అక్కడినుంచే వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. చనిపోయిన వారిని కృష్ణ నాయుడు, జనార్ధన్, బాబూరావు, పిటి అంటోనీ గా గుర్తించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు  రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  అధికారులతో మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular