Sunday, June 7, 2026
HomeTrending Newsద్రౌపది ముర్ముకు సిఎం తేనీటి విందు

ద్రౌపది ముర్ముకు సిఎం తేనీటి విందు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము గౌరవార్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా కోల్ కతా నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ ఎంపీలు, మంత్రులు, బిజెపి రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు.

అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని  సిఎం జగన్ నివాసానికి చేరుకున్నారు. సిఎం సతీమణి వైఎస్ భారతి ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. టిటిడి పండితులు వేదం ఆశీర్వచనం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular