CM Jagan Invited Honorable Governor For YSR Awards Function :
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానానికి ముఖ్యఅతిధిగా హాజరు కావాలని గవర్నర్ ను సిఎం కోరారు. సిఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతి తో కలిసి రాజ్ భవన్ కు చేరుకొని గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సిఎం దంపతులకు గవర్నర్ దంపతులు సాదర స్వాగతం పలికారు.
వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపర్చిన వ్యక్తులు, సంస్థలకు ప్రభుత్వం 59 అవార్డులను ప్రకటించింది, ఇందులో 29 వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు ఉన్నాయి. కేటగిరీల వారీగా 8 సంస్థలకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11, కళలు, సంస్కృతి రంగాల్లో 20, సాహిత్యంలో 7, జర్నలిజంలో 6, మెడికల్ అండ్ హెల్త్ లో 7 మందిని అవార్డులకు ఎంపిక చేశారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద 10 లక్షల రూపాయల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ; వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద 5 లక్షల రూపాయల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ బహుకరిచనున్నారు. జూలై 8న అవార్డులను ప్రకటించగా, ఆగస్ట్ 13న ప్రదానం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కోవిడ్ నిబంధనల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. నవంబర్ 1 న అవార్డుల ప్రదానం విజయవాడ లోని ‘ఎన్’ కన్వెన్షన్ కేంద్రంలో జరగనుంది.
Must Read : అధికారం దక్కదనే దుగ్ధతోనే… : సిఎం జగన్