Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పేదవారికి నాణ్యమైన వైద్యం: సిఎం జగన్

పేదవారికి నాణ్యమైన వైద్యం: సిఎం జగన్

పేదవాడికి అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకూ రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 కొత్త కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసున్నామని వీటిలో పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ఇప్పటికే మొదలు పెట్టామని చెప్పారు

మిగిలిన 14 చోట్ల విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, పెనుకొండ, అదోని, నంద్యాలలో నేడు శంఖస్థాపన చేసుకుంటున్నామని సిఎం అన్నారు. దాదాపు రూ.8 వేల కోట్ల వ్యయంతో ఈ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల కూడా ఉంటుందని సిఎం వివరించారు.

246 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు…. ప్రతి పార్లమెంట్ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి మండలంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లు నెలకొల్పుతున్నామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్