రాష్రంలో అమలవుతున్న కర్ఫ్యూ ను జూన్ 10 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్నట్లుగానే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సడలింపు ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో మే 5వ తేదీ నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంది. కర్ఫ్యూ విధించిన తరువాత రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజితివిటీ రేటు తగ్గింది. నేటితో గడువు ముగుస్తున్నందున పొడిగింపుపై సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.