Monday, March 16, 2026
HomeTrending Newsమెడికల్ కాలేజీలు మంజూరు చేయండి: సిఎం

మెడికల్ కాలేజీలు మంజూరు చేయండి: సిఎం

for Sanction: రాష్ట్రానికి మరో 12 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న తర్వాత సిఎం జగన్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలనుఏర్పాటు చేశామని మొత్తంగా ఇప్పుడు 26 జిల్లాలు అయ్యానని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.  రాష్ట్రంలో ఇదివరకే 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా, కేంద్రం పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చిందని వివరించారు.  కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు సిఎం కేంద్రమంత్రిని కోరారు.

సిఎం కేంద్రమంత్రికి అందజేసిన లేఖలో విజ్ఞప్తి చేసిన అంశాలు:

⦿ విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్యసదుపాయాల కొరత ఏర్పడింది

⦿ వైద్యం కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది

⦿ కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్య వ్యవస్థ కీలక పాత్ర పోషించిన విషయాన్ని  గుర్తుచేస్తున్నా

⦿ ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది

⦿ ప్రాథమిక, ద్వితీయ స్థాయిల్లో ఆస్పత్రులను మెరుగుపరుస్తోంది.

⦿ పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, డీహెచ్‌లు, అంతేకాక ప్రస్తుతం ఉన్న బోధనాసుపత్రులను, నర్సింగ్‌ కాలేజీలను అభివృద్ధిచేస్తోంది.

⦿ గణనీయ రీతిలో ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలను భర్తీచేస్తోంది.

⦿ ప్రతి జిల్లాలకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా అత్యాధునిక వైద్యంకోసం అవసరమైన నిపుణులు, ఆరోగ్య సేవలు అందించే మానవవనరులు తయారవుతాయి.

⦿ జిల్లాల విభజన తర్వాత ప్రజారోగ్యవ్యవస్థ పరంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు లేవు.

⦿ 2023 డిసెంబర్‌ నాటికి ఈ కాలేజీల నిర్మాణాలను పూర్తిచేస్తాం, 2024 అడ్మిషన్లకు వాటిని సిద్ధంచేస్తాం.

⦿ వీలైనంత త్వరగా అనుమతులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular