Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

For Sure: సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ గా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు పరశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ‌నున్నారు. తాజాగా ‘సర్కారు వారి పాట’ మ్యూజికల్ సెన్సేషన్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే.

“మ్యూజిక్ చేయడమే కాకుండా దాన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక భాద్యతగా మారింది. చెవులకి మాత్రమే కాదు మేము కూడా కనిపించాల్సిన తప్పనిసరి పరిస్థితిలోకి వచ్చేశాం. ఒకసారి చేశాం.,, ఇప్పుడది అలవాటుగా మారిపోయింది. ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. పాట బాలేకపోతే వారు పెట్టుబడి పెట్టరు. వాళ్లకి కూడా కొన్ని లెక్కలు, టీమ్ వుంటుంది”

Kalaavathi Song 150 Million Views

“అందరూ అప్రూవ్ చేయనిదే అంతంత బడ్జెట్లు రావు. పెట్టుబడికి తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి. ఒక పాట రీచ్ అవాలంటే.. అది గ్లోబల్ గా ఉందా? ఎవరు పాడుతున్నారు? ఇలా చాలా అంశాలు వుంటాయి. ఈ భాద్యతలన్నీ తీసుకోవాల్సివస్తుంది”

“సర్కారు వారి పాట పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్. క‌ళావ‌తి అనే పాట 2020 లాక్ డౌన్ లో చేసిన పాట. నేను, దర్శకుడు పరశురాం గారు, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను. నాకు సామజవరగమనా, దర్శకుడు పరశురాంకి ‘ఇంకేం ఇంకేం కావాలె’లాంటి మేలోడిస్ వున్నాయి. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా అంచనాలతో వుంటారు.  అన్నిటికంటే ముఖ్యం మహేష్ బాబు గారు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్..ఇది చాలా ప్యూర్ గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం. అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం. అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. ఈ గ్యాప్ లో పాటకు రోజు ప్రాణం పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం. మా కష్టం వృధా కాలేదు. ఫాస్టెస్ట్ గా 150మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి కళావతి పాట అందరినీ అలరించింది”

“పరశురాం గారితో ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు చేశా. సర్కారువారి పాట మూడో సినిమా. ఆయనతో పని చేయడం అలవాటే. అయితే పరశురాం గారి గీత గోవిందం ఆడియో పరంగా కూడా పెద్ద హిట్. దాన్ని బ్యాలన్స్ చేయాలి. అన్నిటికంటే మహేష్ బాబు గారి సినిమా అంచనాలు అందుకోవడం పెద్ద ఛాలెంజ్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సినిమా కోసం రెండేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అయితే.. వారి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా సర్కారువారి పాట ఉండబోతుంది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com