Friday, April 19, 2024
HomeTrending Newsప్రతి పంచాయతిలో డిజిటల్ లైబ్రరీ: సిఎం

ప్రతి పంచాయతిలో డిజిటల్ లైబ్రరీ: సిఎం

‘వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్’ను  బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలపై సిఎం సమీక్ష నిర్వహించారు.  గ్రామాలకు మంచి సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.  ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు….

  • ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులకు ఉపయోగకరంగా డిజిటల్‌ లైబ్రరీలు
  • డిజిటల్‌ లైబ్రరీల్లో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలి
  • గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌….  నిరంతర ఇంటర్నెట్‌ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి
  • ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయాలి
  • అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుంది
  • ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలి, ఈలోగా స్థలాలు గుర్తించి అందజేయాలి
  • డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా ప్రణాళిక వేసుకున్నామని సిఎం కు తెలిపిన అధికారులు
  • స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలి
  • మౌలిక సదుపాయాల్లో భాగంగా 3 డెస్క్ టాప్ టేబుల్స్, సిస్టమ్ చెయిర్స్, విజిటర్‌ చెయిర్స్, ట్యూబులైట్స్, ఫ్యాన్‌లు, ఐరన్‌ ర్యాక్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్‌ డిజిటల్‌ లైబ్రరీల్లో ఏర్పాటు చేయాలి
  • తొలివిడతలో భాగంగా 4530 డిజిటల్‌ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు
  • కంప్యూటర్‌ పరికరాలకోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ఖర్చు

ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ ఎం మధుసూధన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఎండీ ఎం నంద కిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్