Saturday, March 14, 2026
HomeTrending Newsసిఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

సిఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు కార్యాలయంలో రాధాకృష్ణన్  చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. “ చ‌దువే త‌ర‌గ‌ని ఆస్తి… గురువే రూపశిల్పి… విద్యార్థుల‌ను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న గురువులకు శిర‌స్సు వంచి న‌మ‌స్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి, భార‌త‌ర‌త్న డాక్టర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణన్ జ‌యంతి సంద‌ర్భంగా ఉపాధ్యాయులంద‌రికీ టీచ‌ర్స్ డే శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular