Cm Jagan Paid Tributes To Moulana Azad :
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు కరీమున్నీసా బేగం కూడా పాల్గొన్నారు.
మౌలానా ఆజాద్ స్వాతంత్ర్యానంతరం భారత దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. విద్యారంగానికి అయన చేసిన సేవలకు గాను ప్రతియేటా అయన జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నేడు గుంటూరు మెడికల్ కాలేజిలోని జింఖానా ఆడిటోరియంలో మౌలానా ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 11 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనాబ్ ఎస్.బి.అంజాద్ బాషా, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.
Also Read : వేదిత దంపతులకు జగన్ ఆశీస్సులు