Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

Ap Government Called For Employees Joint Staff Council Meeting :

శుక్రవారం ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఆర్సీ నివేదిక, ఫిట్ మెంట్, ఉద్యోగుల ఇతర సమస్యలపై సంఘాలు ఆందోళన బాట పట్టాలని కార్యాచరణకు సిద్ధం అవుతుండడంతో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఉద్యోగుల డిమాండ్లపై నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సిఎం జగన్ తో సమావేశమయ్యారు. ఈ భేటి తర్వాత సిఎస్ ను కలిసేందుకు  ఉద్యోగ సంఘాల నేతలు వేచి ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు, దీనిపై కొందరు ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తమను నిర్లక్ష్యం చేస్తోందని వారు భావిస్తున్నారు, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వీలైనంత త్వరగా చొరవ చూపించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని, ఉద్యమ బాట పట్టాలని యోచిస్తున్నారు.

దీనితో ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది, దీని తర్వాత పీఅర్సీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read :

త్వరలో పీఆర్సీ: ఉద్యోగులకు సజ్జల హామీ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్