Sunday, June 7, 2026
HomeTrending Newsఇఫ్తార్ లో పాల్గొన్న సిఎం జగన్

ఇఫ్తార్ లో పాల్గొన్న సిఎం జగన్

Iftar: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు  ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో మంత్రులు, పార్టీ నేతలతో కలిసి హాజరైన సిఎం ప్రత్యక నమాజ్ లో పాలుపంచుకున్నారు.  అంతకుముంది  వన్ టౌన్ లోని వించిపేటలో నిర్మించిన షాజహూర్‌ ముసాఫిర్‌ ఖానాను ముఖ్యమంత్రి ప్రారంభించారు.   15 కోట్ల రూపాయలతో ఈ ముసాఫిర్  నిర్మించారు.

Cm Jagan Iftar Party


Cm Jagan Iftar Party

సిఎం వెంట ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ భాషా, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానుమ్, మంత్రులు తావేటి వనిత, కొట్టు సత్యనారాయణ,  ఆర్కే రోజా, జోగి రమేష్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read : మీరు నా కళ్ళు, చెవులు: సిఎం జగన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular