Tuesday, June 16, 2026
HomeTrending Newsశాంతి యజ్ఞంలో పాల్గొన్న సిఎం జగన్

శాంతి యజ్ఞంలో పాల్గొన్న సిఎం జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.  ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సిఎం పాల్గొన్న సంగతి తెలిసిందే.  మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నేడు ఆదివారం వేదపండితులు నిర్వహించారు.

ముఖ్యమంత్రితో పాటు శాంతి యజ్ఞంలో డిప్యూటీ సీఎం (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ కూడాపాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular