ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శ్రీ శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డిలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి ఈ ఏడాది పంచాగాన్ని ఆవిష్కరించారు. శ్రీ కప్పగంతుల సుబ్బరాయ సోమయాజ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. సిఎం దంపతులకు ఉగాది పచ్చడి  అందజేశారు. సోమయాజ సిద్ధంతిని సిఎం జగన్ పట్టు వస్త్రాలతో సత్కరించారు.  తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం వేదపండితులు సిఎం దంపతులకు వేదం ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి హాజరైన కళాకారులు, చిన్నారులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. వ్యవసాయ పంచాంగం 2023–24ను,  సాంస్కృతికశాఖ రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వేద పండితులును, కళాకారులను  సిఎం సత్కరించారు.

ఈ సందర్భంగా సిఎం ప్రసంగిస్తూ… “ఇక్కడకి ఉగాది వేడుకలకు హాజరైన వారితో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడుకి, స్నేహితుడికీ, ప్రతి అవ్వాతాతలకూ ఈ ఉగాది సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా మంచి జరగాలని, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు” అంటూ సందేశం ఇచ్చారు.  ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యన్నారాయణ, సాంస్క్రృతిక పర్యాటకశాఖమంత్రి ఆర్‌ కె రోజా, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *