Saturday, June 27, 2026
HomeTrending Newsఆక్వా రైతులకు మేలు: సిఎం జగన్

ఆక్వా రైతులకు మేలు: సిఎం జగన్

ప్రజలకు పౌష్టికాహారం అందించడం, స్థానిక వినియోగాన్నిపెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకే ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సరిగ్గా పంట చేతికి వచ్చేనాటికి దళారులు సిండికేట్‌ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారని, ప్రాసెసింగ్‌, ఎగుమతులు చేసే కంపెనీలు సిండికేట్‌ అవుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అయన అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మత్స్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఆక్వాహబ్‌లు, మత్ససాగులో కొత్త విధానాలు, రైతులకు మేలు చేసే అంశాలపై అధికారులతో చర్చించారు. ఫిష్‌ ఆంధ్రా లోగోను సిఎం విడుదల చేశారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…

⦿ ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోంది
⦿ ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలి
⦿ రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలి
⦿ ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్‌లో నాణ్యత కోసం చట్టాన్ని తీసుకువచ్చాం, దీన్ని పటిష్టంగా అమలు చేయాలి
⦿ ఆక్వారంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతులకు నేరుగా అందేలా చూడాలి
⦿ ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్‌ కూడా పెట్టే ఆలోచన చేయాలి

ఆక్వా హబ్ లపై సిఎంకు వివరాలు అందించిన అధికారులు

⦿ ఆక్వాహబ్‌లు, అనుబంధ రిటైల్‌ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి
⦿ జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌ లు, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు అందుబాటులోకి వస్తాయి
⦿ వచ్చే ఏడాది డిసెంబర్‌నాటికి ప్రి ప్రాససింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లను సిద్ధం
⦿ 10 ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు
⦿ మార్కెట్లో సిండికేట్‌కు చెక్‌ పెట్టగలుగుతాం, రైతులకు మంచి ధరలు వస్తాయి

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు

⦿ నాలుగు ఫిషింగ్‌ హార్బర్లలో పనులు మొదలయ్యాయి
⦿ జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం
⦿ వచ్చే ఏడాది జూన్‌, జులై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధం చేస్తాం
⦿ మిగిలిన 5 ఫిషింగ్‌ హార్బర్ల పనులు డిసెంబర్‌లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు

జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సిఎం జగన్‌ సమీక్ష

అమూల్‌ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని మిగతా డెయిరీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమూల్‌ వచ్చాక లీటరుకు 5నుంచి 15 రూపాయల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రేట్లపరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు.  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ‘జగనన్న అమూల్‌ పాలవెల్లువ’పై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

⦿ మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నాం
⦿ తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారు
⦿ వీరికి మరింత చేయూత నివ్వడానికి  బీఎంసీయూలను నిర్మిస్తున్నాం
⦿ మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి
⦿ బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలి
⦿ దీనివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుంది
⦿ మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నాం
⦿ పారదర్శక సహకార వ్యవస్థద్వారా మహిళలకు మేలు జరుగుతుంది
⦿ గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలి
⦿ చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ-మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు;  జగనన్న పాలవెల్లువ- శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం వైయస్‌.జగన్‌ ఆవిష్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular