Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Income Sources: తొలివిడత భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే 650 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలపగా ఈ  సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని సూచించారు. 14 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నామని  అధికారులు సిఎం కు వివరించారు. ప్రభుత్వానికి రెవెన్యూ అందిస్తోన్న రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భగనులు, అటవీ శాఖలపై  క్యాంపు కార్యాలయంలో సిఎం  సమీక్ష  నిర్వహించారు. ఈ శాఖల్లో  ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయాలు పెంచుకోవాలని సిఎం సూచించారు.

సమీక్ష సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు…

⦿ ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలి

⦿ టిడ్కోకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలి

⦿ గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక ఎలాంటి సేవలు పొందవచ్చన్న అంశాలపై సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలి

⦿ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందన్న దానిపై వివరించాలి

⦿ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి

⦿ 2,700క్వారీలలో మైనర్‌ మినరల్‌ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలి, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయి

⦿ ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ గనులనుంచి జెన్‌కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలి

⦿ దీనివల్ల జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు మేలు జరుగుతుంది

⦿ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈబొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడాలి

⦿ వాణిజ్య పన్నుల శాఖ పునర్‌నిర్మాణం చేయాలి, శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఉండాలి

⦿ జూన్‌కల్లా వాణిజ్య పన్నుల శాఖలో  డాటా అనలిటిక్స్‌ లీగల్‌సెల్‌ విభాగాలు ఏర్పాటు చేయాలి

⦿ బకాయిల వసూలుకు ఓటీఎస్‌ సదుపాయం కల్పించాలి

⦿ అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన,అటవీ పర్యావరణ, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్సు ఎన్‌ ప్రతీప్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: సిఎం  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com